స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 9 : పెంచిన పెన్షన్ ఎప్పుడిస్తారు సారూ.. అని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఓ మహిళ ప్రశ్నించింది. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూర్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే కడియం మాట్లాడుతుండగా రూ.నాలుగు వేల పెన్షన్ ఎప్పుడిస్తారని గ్రామానికి చెందిన షేక్ కాజమ్మతోపాటు పలువురు మహిళలు అడిగారు. దీనికి సమాధానం చెప్పకుండానే కడియం ప్రచారం ముగించుకొని వెళ్లిపోయారు.