హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో(Shabad) రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన నరహంతకుడు రాజ్‌కుమార్( Rajkumar) అచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. నిందితుడిని పట్టిస్టే రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే సూర్యాపేట జిల్లాలో కోదాడ పక్కనే ఉన్న బంజారా తండాకు చెందిన ఓ యువకుడు అచ్చు గుద్దినట్లు రాజ్ కుమార్ లాగా ఉండటంతో విస్తుపోయిన ఓ మహిళ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేసి, అతను రాజ్ కుమార్ కాదని తేల్చారు. కాగా, హత్యలు జరిగి రెండు రోజులు కావసొస్తున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోవడంతో రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్‌పై విమర్శలు వెల్లవెత్తున్నాయి.