పెళ్లికి ముందే తన భార్య మరో వ్యక్తిని ప్రేమించిందన్న విషయం తెలిసి, ప్రియుడితో కలిసి ఎక్కడ చంపేస్తుందేమో అని భయంతో ఓ భర్త వదిలేశాడు. ఇదే ఛాన్స్ అని భార్యకు దగ్గరయ్యాడు. ఆమెను పూర్తిగా వాడుకుని.. పెళ్లి మాట ఎత్తగానే మొహం తిప్పేశాడు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తన పరిస్థితి మారిందని సదరు భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరుకు చెందిన ఓ యువతికి.. అదే గ్రామానికి చెందిన సురేశ్ ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు ఆమెకు కర్ణాటకకు చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు. అయినప్పటికీ సురేశ్ ఆమెను వదల్లేదు. ఆమెకు నిత్యం ఫోన్ చేసి వేధిస్తూ ఉండేవాడు. ఇది గమనించిన భర్త.. పెళ్లికి ముందు తన భార్య లవ్ స్టోరీని తెలుసుకున్నాడు. దీంతో షాకయ్యాడు.
ప్రియుడితో కలిసి తనను తన భార్య ఎక్కడ చంపేస్తుందేమోనని భయపడిపోయాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో అక్షితతో తెగదెంపులు చేసుకున్నాడు. భర్త విడిచిపెట్టడంతో తిరిగి బెల్కటూర్‌కు వచ్చిన ఆమెతో సురేశ్ తన ప్రేమాయణాన్ని కంటిన్యూ చేశారు. నీకు నేనున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. శారీరకంగా వాడుకుని మొహం చాటేశాడు. సురేశ్‌ను పెళ్లి గురించి అడగడంతో అతను దూరం పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.