ఆర్మూర్‌టౌన్, జూన్ 12: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో పట్టుతప్పి కిందపడిన మహిళ కాళ్ల పైనుంచి టైర్లు వెళ్లడంతో ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. నిర్మల్‌కు చెందిన సుజాత బుధవారం ఆర్మూర్‌కు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు బస్టాండ్‌కు రాగా.. అప్పటికే నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. నిర్మల్ డిపో బస్సు.. ప్లాట్ఫారం నుంచి రివర్స్‌లో వెళ్తుండగా సుజాత బస్సు ఎక్కే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సుజాత కిందపడిపోగా.. బస్సు టైర్లు ఆమె కాళ్ల పైనుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. బాధితురాలిని దవాఖానకు తరలించిన పోలీసులు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.