యాదాద్రి భువనగిరి : మూడు వారాల క్రితం అదృష్యమైన ఓ వివాహిత చెట్టుకు ఉరేసుకొని(Hanging) ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న ఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా పరిధిలో భూక్య శారద అనే వివాహిత మూడు వారాల క్రితం అదృశ్యమైంది.
అయితే మృతురాలు గ్రామం పక్కన ఓ మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే మూడు వారాల క్రితం ఈ మహిళ అదృశ్యమైనట్లుగా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు కింద కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.