KCR | ఇందల్వాయి/సదాశివనగర్ : దేశానికి ప్రధానిగా సీఎం కేసీఆర్( CM KCR ) కావాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్( Nizamabad ) జిల్లాకు చెందిన ఓ యువకుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.
ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండాకు చెందిన దేగావత్ రమేశ్ నాయక్( Ramesh Naik ) అనే యువకుడు శనివారం పాదయాత్ర మొదలుపెట్టాడు. కేసీఆర్ ప్రధాని కావాలంటూ ముద్రించిన ఫ్లెక్సీని చేతబట్టుకొని, కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. కేసీఆర్ పీఎం అయితే రాష్ట్రం మాదిరిగానే దేశమంతా సుభిక్షమైన పాలన వస్తుందని, తెలంగాణలోని సంక్షేమ పథకాలన్నీ దేశమంతటా అమలు అవుతాయని చెప్పారు. ఈ పాదయాత్ర హైదరాబాద్లోని ప్రగతిభవన్ వరకు నిర్వహిస్తానని ఈ సందర్భంగా రమేశ్ నాయక్ తెలిపాడు.