Ganja | కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం సృష్టించింది. తిర్యాణి మండలం కొద్దుగూడ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పక్కా ప్రణాళికతో శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు.
అత్రం పాపరావు అనే గిరిజన రైతు తన పంట పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలియడంతో నేరుగా పోలీసులు అక్కడికి వెళ్లారు. కంది పంటలో కలిపి గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. లక్ష విలువ చేసే పది గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.