హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : కవ్వాల్ టైగర్ జోన్లో నాలుగు రోజుల నుంచి పెద్దపులి సంచరిస్తోందని ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు. జన్నారం రేంజ్ పరిధి గోండుగూడ బీట్తో పాటు అల్లీనగర్, దొంగపెల్లి అటవీ ప్రాంతాల్లో ఈ నెల 22న యానిమల్ ట్రాకర్స్తో అడుగులను గుర్తించి, మగపులిగా నిర్ధారించారు.
10 రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని, గుండాల అడవుల్లో తిరిగిన పెద్దపులి ప్రస్తుతం కవ్వాల్ టైగర్ జోన్లో సంతరిస్తున్న పులి ఒక్కటేనని భావిస్తున్నారు. 2019లో కవ్వాల్ అడవుల్లో సంచరించిన పులి..అప్పటి నుంచి మళ్లీ రాలేదు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి కాగజ్నగర్ కారిడార్ ద్వారా ఆసిఫాబాద్ అడవులవైపు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇన్నేండ్ల తర్వాత కవ్వాల్ టైగర్ జోన్లోని పులి రావడంతో ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు.