రఘునాథపాలెం, ఫిబ్రవరి 9: అప్పులబాధతో కౌలు రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సీఐ ఉస్మాన్షరీఫ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చెరువుకొమ్ముతండాకు చెందిన భూక్యా లక్ష్మా (40) ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగుచేస్తున్నాడు.
ఈ ఏడాది పంటలు దెబ్బతినడంతో అప్పులపాలయ్యాడు. తీర్చే మార్గం కన్పించక మనస్తాపం చెంది గత నెల 13న గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. 26 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందాడు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.