హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): సమ్మక, సారక జాతరకు వచ్చే భక్తుల కోసం మేడారంలో తాతాలికంగా 50 బెడ్ల దవాఖాన (సమ్మక సారక వైద్యశాల)ను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న మేడారం జాతర ఏర్పాట్లపై, తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం వైద్య, ఆరోగ్య, ఆయుష్, ఫుడ్ సేఫ్టీ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారంలోని ఇంగ్లిష్ మీడియం సూ ల్లో 6 బెడ్లతో, ప్రత్యేక వైద్యులతో కూడిన వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని, జాతర పరిసరాల్లో 30, మేడారం వెళ్లే వివి ధ రూట్లలో మరో 42 వైద్య శిబిరాల ను ఏర్పాటు చే యాలని ఆదేశించారు.