ఖైరతాబాద్, మే 30: తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామ దేవస్థానాన్ని పోలిన ఆలయం అమెరికా లో నిర్మించనున్నారు. శ్రీరామ్ సంస్థాన్ ఇన్కార్పొరేటెడ్ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేయబోతున్నది. దాతల విరాళాలు రూ.250 కోట్లతో ఆలయా న్ని నిర్మించనున్నారు. బుధవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంస్థాన్ చైర్మన్ పద్మనాభాచార్యు లు వివరాలను వెల్లడించారు. 2019లో యూఎస్ఏలోని అట్లాంట హైవే వద్ద 33ఎకరాల విస్తీర్ణంలో ఆల యం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఆగస్టు 17న ప్రత్యేక విమానంలో ఆయోధ్య నుంచి ఖగోళయాత్ర ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 17 నాటికి భారతదేశానికి చేరుకొని భద్రాచలంలో ముగిస్తామని తెలిపారు. ఆయా దేశాల్లో సీతారాముల కల్యాణోత్స వం నిర్వహిస్తామన్నారు. 2025 శ్రీరామనవమి నాటి కి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీలోని ఆళ్లగడ్డలో ప్రముఖ శిల్పిరత్న డీ రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో 200 మంది శిల్ప కళాకారులు, 15 మంది ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు నిర్విరామంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. సంస్థాన్ ప్రతినిధులు జాడ కాశీవిశ్వనాథ శర్మ, ఎం సంతోష్ శర్మ పాల్గొన్నారు.