అమెరికాలో తెలంగాణ విద్యార్థి హత్య
అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
- గన్‌తో కాల్చిన మరో తెలుగు వ్యక్తి
- నిందితుడు గోలి రవితేజ అరెస్ట్
- మృతుడిది ఖమ్మం జిల్లా మధిర
హైదరాబాద్, హ్యూస్టన్: అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. గోలి రవితేజ(23) అనే మరో తెలుగు విద్యార్థి ఆదివారం రాత్రి అఖిల్‌పై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అఖిల్ తలలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. వెంటనే అతడిని దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఇద్దరూ అలబామా రాజధాని మాంట్‌గోమెరీలో నివసిస్తున్నారు.
హత్య ఆరోపణలతో రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఇద్దరి మధ్య ఎందుకు వివాదం తలెత్తింది ? హత్యకు కారణాలేంటనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ముందుగా ఇది ప్రమాదవశాత్తూ జరిగిందనే వార్తలు వచ్చాయి. సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న గన్ తీసుకొని చూస్తుండగా అది పేలి అఖిల్ మరణించాడనే వార్తలు రాగా స్థానిక మీడియా మాత్రం ఇది హత్యగా పేర్కొంది. కాగా, అఖిల్‌సాయి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్రాన్ని అతడి కుటుంబం కోరింది. సాయి కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

