Tirumala | తిరుమల : తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద ఆ భక్తుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. అతడిని హుటాహుటిన చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్(50)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెంకటేశ్ డెడ్‌బాడీని షాద్‌నగర్‌కు తరలిస్తున్నారు.