హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ల బృందం పరిశీలించింది.
అనంతరం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజన్తో బృందం భేటీ అయ్యింది. ప్రజావాణి అమలు తీరును అడిగి తెలుసుకున్నది.