హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ట్రామాకేర్ వ్యవస్థను బలోపేతం చేయడంపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు తమిళనాడులో అమలవుతున్న ట్రామాకేర్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వైద్యాధికారుల బృందాన్ని అక్కడికి పంపింది. టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ సహదేవ్ తదితరుల బృందం రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం చెన్నైకి వెళ్లింది.
వారికి తమిళనాడు హెల్త్ సిస్టమ్స్ ప్రాజెక్ట్(టీఎన్హెచ్ఎస్పీ) అధికారులు స్వాగతం పలికారు. అక్కడ అమలవుతున్న వైద్య విధానాన్ని వివరించారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోట్లు, ఆత్మహత్యాయత్నాలపై అక్కడి దవాఖానల్లో అందిస్తున్న చికిత్సల గురించి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు ప్రారంభించిన ‘104’పై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో సమయానుకూలంగా ఈ సంచార వాహనాల ద్వారా గ్రామాల్లో రోగులకు వైద్యసేవలందించి మందులు ఇచ్చేవారు. సిద్దిపేట కలెక్టరేట్ వెనుక భాగంలో 8 వరకు 104 వాహనాలు మూలనపడి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయి.
-నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సిద్దిపేట