హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అటవీశాఖ సమగ్రాభివృద్ధికి జపాన్ ఇంటర్నేషనల్ ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రుణ సహాయం పొందేందుకు అటవీశాఖ ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ సువర్ణ తెలిపారు. సోమవారం అరణ్యభవన్‌లో జైకా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అటవీశాఖ తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. ఐదేండ్ల కాలానికి రూ.1270 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో జైకా ప్రతినిధులు ఇహా చినాట్సు, షిమోజో హిటోమీ , జైకా భారతీయ ప్రతినిధి సిద్ధార్థ్ పరమేశ్వరన్ పాల్గొన్నారు.