దుండిగల్, మే 31: లోన్‌యాప్ వేధింపులకు సాఫ్ట్వేర్ ఉద్యోగి బలయ్యాడు. పోలీసులు వివరాల ప్రకా రం.. ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరవర్ధన్(33), వి మల దంపతులు బాచుపల్లి కౌసల్యకాలనీలో ఎస్ఎస్కే అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు.
వీరవర్ధన్ ఇటీవల ఓ లోన్యాప్లో రుణం తీసుకో గా యాప్ నుంచి వేధింపులు అధికమయ్యాయి. బుధవారం వీరవర్ధన్ పెద్దమ్మకు లోన్‌యాప్ నిర్వాహకులు ఫోన్‌చేసి వీరవర్ధన్ డబ్బులు చెల్లించడంలేదని తెలిపారు. కాగా, గురువారం ఆయన ఫ్లాట్ హాల్లో హర్షవర్ధన్ ఉరేసుకుని కనిపించాడు. కొన్ని నెలలక్రితం వీరవర్ధన్ భార్య కాన్పుకోసం పుట్టింటికి వెళ్లింది. వీరికి 6 నెలల కొడుకు ఉన్నాడు.