MBSC | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ఎంబీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని అన్నారు. వచ్చే నెలలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ భాద్యతలు ఈసారి ఎంబీఎస్సీ కులాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర నాయకులు ఉపదే సనధన్ మాంగ్ గారోడి, కురువ వెంకన్న మాదాసి కురువ, కొల్పుల నవీన్, పంబాల ఎల్లేష్, కురువ బాలరాజు, ఉపదే మహేష్, కాంబ్లే విజయ్, కాంబ్లే గోపి, కొల్పుల గోవర్ధన్, సకట్ సంజీవ్, జీత్లాల్ తదితరులు పాల్గొన్నారు.