కరీంనగర్ విద్యానగర్/ జగిత్యాల మే 8: రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై దేశద్రోహం కేసు నమోదుచేయాలని కరీంనగర్, జగిత్యాల పోలీసులకు బీజేపీ, భారత సురక్ష సమితి నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు.
కరీంనగర్లో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే దానిని తప్పుబట్టేలా వ్యవహరించడం ముమ్మాటికీ దేశద్రోహమేనన్నారు. జగిత్యాలలో భారత సురక్ష సమితి నాయకులు టౌన్ సీఐ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు.