కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో(Kamareddy) విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురు అరుణ్ (32), రవళి (27), సాయి రెడ్డి (26), శివానంద్ (4), ఆరాధ్య (సంవత్సరం), శివ కుమార్(24) కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, కారు హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా జరిగిన ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
