హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ (సీఆర్డీ) కార్యాలయంలో ఓ రిటైర్డ్ అధికారి తిష్ట వేశాడు. ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహారశైలి ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గత మార్చి 12న సెర్ప్ ఉద్యోగులకు ఐఆర్ ఐదు శాతం వర్తింపచేస్తూ సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్వయంగా సంత కం చేసి ఆర్డర్ రిలీజ్ చేసినప్పటికీ.. సీఆర్డీలో రిటైర్డ్ కన్సల్టెంట్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగా లేనిపోని అడ్డంకులు సృష్టించి ఆరు నెలల కాలయాపన చేశాడని సెర్ప్ ఉద్యోగ సం ఘాల స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్ ఏపూరి నరసయ్య, జానయ్య, మహేశ్ సుదర్శన్ ఆరోపించారు. మంత్రి సీత క, శాఖ ముఖ్యకార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యలకు ఫిర్యాదు చేయడంతో ఆరు నెలల ఆలస్యం తర్వాత ఈ నెలలో జమ చేశారని చెప్పారు.
సెర్ప్ ఉద్యోగులకు రెండున్నర దశాబ్దాలుగా హకుగా అందుతున్న ప్రయోజనాలను ఆరు నెలలుగా అడ్డుకుంటున్న రిటైర్డ్ కన్సల్టెంట్ సుబ్బారావు తీరుకు నిరసనగా బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వారు ప్రకటించారు. ఈ రిటైర్డ్ అధికారి చేష్టలకు 3974 సెర్ప్ ఉద్యోగులు విసిగి పోయారని, బుధవారం అన్ని జిల్లాల యూనియన్ సభ్యులు, సెర్ప్ ఉద్యోగులు పాల్గొం టారని స్టేట్ జేఏసీ నాయకులు ప్రకటించారు. సెర్ప్ ప్రధా న కార్యాలయానికి వెళ్లి సీఈవోకి, పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో రిటైర్డ్ కన్సల్టెంట్పై ఫిర్యాదు చేస్తామని, అప్పటికీ అతని వైఖరిలో మార్పు రాకపోతే నేరుగా మంత్రికి ఫిర్యాదు చేస్తామని, ఈ ఉద్యోగిని తొలగించి కఠినచర్యలు తీసుకునే వరకు నిరవధిక నిరసన చేపడతామని హెచ్చరించారు.