Home
Telangana
A Relief Bus Belonging To Aps Rtc In Suryapet Was Brought In For Repairs When A Fire Broke Out In The Battery Of The Relief Bus
మంటలు చెలరేగి రెండు బస్సులు దగ్ధం
సాంకేతిక లోపంతో ఆగిపోయిన బస్సును తరలించడానికి వచ్చిన మరో బస్సులో మంటలు చెలరేగాయి.
చివ్వెంల, ఫిబ్రవరి 26 : సాంకేతిక లోపంతో ఆగిపోయిన బస్సును తరలించడానికి వచ్చిన మరో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు బస్సులు దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల శివారులో 65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 6 గంటలకు చోటుచేసుకున్నది. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా గుంపుల వద్ద సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. దాంతో బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.
మరమ్మతు చేయడానికి సూర్యాపేటలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రిలీఫ్ బస్సును తీసుకొచ్చి మరమ్మతులు చేపడుతుండగా రిలీఫ్ బస్సులోని బ్యాటరీలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను మళ్లించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

