ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామంలోని రాక్షస గుహల సమీపంలోని ఊర చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు అరుదైన ముద్ర లభ్యమైంది. చెరువులో మట్టిని తవ్వుతున్న క్రమంలో గ్రామానికి చెందిన కార్తీక్కు ఈ ముద్ర లభించగా, ఆయన చరిత్ర పరిశోధకుడు రత్నాకర్రెడ్డికి అందజేశారు.
అది 2500 సంవత్సరాల కాలం నాటిదై ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ముద్ర ఎరుపు రంగులో ఐదు రేకులతో కూడిన పువ్వు ఆకారంలో ఉన్నదని తెలిపారు.
– తాడ్వాయి