వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు(Free bus) పథకం మహిళల కష్టాలను రెట్టింపు చేస్తు న్నాయి. ఉచిత ప్రయాణంతో సరిపడా బస్సులు లేక, ఉన్నా టైంకు రాక, వచ్చినా బస్సులు ఆపకుండా వెళ్లడం, మహిళలకు కనీస గౌరవం ఇవ్వకపోవడంతో తెలంగాణ ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడుతు న్నారు. ప్రతిరోజు ఏదోఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బస్సు ఆపలేదని ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే..వరంగల్(Warangal) బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించింది. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగగా.. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో సదరు మహిళ డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహంతో ఆటోలో బస్సును వెంబడించింది. రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని తన నిరసన(Woman protest) వ్యక్తం చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి పలువురు ప్రయాణికులు సర్దిచెప్పడంతో తన ఆందోళనను విరమించనట్లు సమాచారం.