సంగారెడ్డి : పండుగపూట విషాదం నెలకొంది. నిషేధిత చైనా మాంజా మంది ప్రాణాలను తీస్తున్న అటు ప్రభుత్వం ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా చైనా మాంజాతో గొంతు తెగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా జిల్లా ఫసల్వాది గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అవిదేశ్ (35) అనే వ్యక్తి బైక్ బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా గొంతును కోయడంతో మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చైనా మాంజా ప్రాణాల మీదకు తీసుకొస్తుందని.. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.