యాదాద్రి భువనగిరి : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మండుటెండలకు ఉక్కపోత కూడా తీవ్రమైంది. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ దెబ్బకు పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri district) భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి(63) అనే వ్యక్తి వడదెబ్బతో(Sunstroke) మృతి చెందాడు. భువనగిరి పట్టణంలో బైక్ పై వెళ్తుండగా ఎండ దాటికి తట్టుకోలేక కుప్పకూలిన నర్సిరెడ్డిని స్థానికులు దవాఖానకు తరలించారు. అప్పటికే నర్సిరెడ్డి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పూర్తి వివవరాలు తెలియాల్సి ఉంది.