వనపర్తి : నక్సలైట్ పేరుతో(Fake Naxalite) అమాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో(Wanaparthi) చోటు చేసుకుంది. శుక్రవారంజిల్లా పోలీసు కార్యాల యంలో ఎస్పీ రావుల గిరిధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం, మామిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి అలియాస్ ప్రమోద్‌రెడ్డి అనే వ్యక్తి మాజీ నక్సలైట్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సోలిపూర్ గ్రామానికి చెందిన తేనేటి శేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి రైస్ మిల్లు అసోసియేషన్(Rice Mill Association) నుంచి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
డబ్బులు వెంటనే ఇవ్వకుంటే మిమ్మల్ని చంపుతానని చెప్పి బెదిరించాడు. శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సుదర్శన్‌రెడ్డి అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు చేసేవాడన్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు అని తేలిపోయింది : హరీశ్ రావు
Hyderabad | రేవంత్ రెడ్డిని సంపడానికి అయినా సావడానికి అయినా సిద్ధం.. మూసీ బాధితురాలి ఆవేదన