Karimnagar | కరీంనగర్ : కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం లేనిదే పని చేయరు. లంచం ఇస్తేనే పని జరుగుతుంది.. ఫైలు ముందుకు కదులుతుంది. అలాంటి అవినీతి అధికారులు అప్పుడప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతారు. ఇక అవినీతి తిమింగలాల చేతిలో బలైన సామాన్య ప్రజలు సంబురాలు చేసుకుంటారు. అయితే ఓ పంచాయతీ అధికారి కూడా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో.. ఆ గ్రామస్తులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేశారు. రూ. 20 వేలు ఇస్తేనే ఇంటి నంబర్ ఇస్తానని పంచాయతీ కార్యదర్శి చెప్పాడు. చేసేదేమీ లేక బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో.. గ్రామస్తులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు… pic.twitter.com/5ICNa26buC
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2025