CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా, మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు( Welfare Schemes ) ప్రతి గడపకు చేరుతున్నాయి. దాంతో ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై ఓ వృద్ధురాలు ప్రశంసల వర్షం కురిపించింది. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉన్న కేసీఆర్ అండగా ఉండగా.. మాకేంది బిడ్డా.. అని హరీశ్‌రావుతో ఓ వృద్ధురాలు ముచ్చటించారు.
సిద్దిపేట జిల్లా( Siddipeta ) దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియాల్‌లో మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందు కూర్చున్న ఓ వృద్ధురాలితో హరీశ్‌రావు ఆత్మీయంగా మాట్లాడారు.
హరీశ్‌రావు మాట్లాడిన అనంతరం ఆమె కూడా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ఉండగా మాకు.. తక్కువేముందని అని చెప్పింది. కన్న బిడ్డల్లా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని తెలిపింది. నాకు పింఛన్( Aasara Pension ) వస్తుంది.. ఇంటికి నీళ్లు వస్తున్నాయి.. కరెంట్ వస్తుంది. రైతులకు రైతుబంధు( Rythubandhu ) వస్తుంది.. అందరం సంతోషంగా ఉన్నామని పెద్దమ్మ నవ్వుతూ చెప్పడంతో ఆ ప్రాంతంలో నవ్వులు విరిసాయి.