హైదరాబాద్, జూన్ 13 (నమస్తేతెలంగాణ): తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో నూతనంగా పునరుద్ధరించిన ఫిట్నెస్ సెంటర్ (జిమ్) ప్రారంభమైంది. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో పునరుద్ధరించిన ఈ జిమ్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, కార్యదర్శి పీ శ్రవణ్ కుమార్‌గౌడ్, సంయుక్త కార్యదర్శి కే నిరంజన్‌రెడ్డి, కోశాధికారి బాలాజీ బానోత్, సంయుక్త కార్యదర్శి పీ కృష్ణ కీర్తన, క్రీడలు-సాంసృతిక విభాగం కార్యదర్శి విష్ణువర్ధన్ జయసూర్య, కార్యవర్గ సభ్యులు కృష్ణకుమార్ నాగులూరి, రుక్మిణి పల్లెల, భార్గవి కావల్, పూల్ సింగ్ మైక్ రమావత్, కొండారెడ్డి జకా, శిల్పా గెల్లి, అరవింద్ కుమార్ గాడి, రవి పొనంపెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవృత్తిలో కొనసాగేవారికి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అత్యంత కీలకమని పేరొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ అందుకు దోహదపడుతుందని చెప్పారు.