త్వరలో ‘కేసీఆర్ జీవబంధు’
గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ‘కేసీఆర్ జీవబంధు’ అనే కొత్త పథకం అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ వెల్లడించారు.
- గొర్రెల పెంపకందారుల కోసం కొత్త పథకం.. త్వరలో కేసీఆర్ మటన్ క్యాంటీన్
- గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్యాదవ్
హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ‘కేసీఆర్ జీవబంధు’ అనే కొత్త పథకం అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లో సీఎస్ శాంతికుమారితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం బాల్రాజ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు ఐదారు వేల గొర్రెలు వివిధ రకాల ప్రమాదాల కారణంగా చనిపోతున్నాయిని తెలిపారు.
దీంతో పెంపకందారులు నష్టపోకుండా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికే ఈ పథకాన్ని రూపొందించినట్టు తెలిపారు. గొర్రెల పంపిణీతో పెంపకందారుల జీవితాల్లో వచ్చిన ఆర్థిక, సామాజిక మార్పులపై సమగ్ర అధ్యయనం చేసినట్టు తెలిపారు. జంటనగరాల్లోని మాంసప్రియుల కోసం శుభ్రమైన, నాణ్యమైన గొర్రె మాంసాన్ని అందించాలనే ఉద్దేశంతో ఫెడరషన్ కార్యాలయ ఆవరణలో త్వరలో ‘కేసీఆర్ మటన్ క్యాంటీన్’ను ప్రారంభించి నాణ్యమైన మటన్ బిర్యానీ, బోటి, మటన్ కూరలను అందించనున్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

