హైదరాబాద్, ఆగస్టు 11 : లలిత జ్యువెల్లరీ..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ నుంచి అధికారిక అనుమతి పత్రం పొందిన సంస్థ..వచ్చే వారంలో ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 17 నుంచి మూడు రోజులపాటు(ఈ నెల 19వరకు) విక్రయించనున్న షేర్లతో రూ.1,700 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. షేరు ధరల శ్రేణిని రూ.190-201 శ్రేణిలో నిర్ణయించింది.
తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.1,200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో షేర్లను విక్రయించడంతో మరో రూ.500 కోట్ల నిధులను సేకరించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.11,250 కోట్లుగా నిర్ణయించింది. ఈ నెల 24న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో కంపెనీకి చెందిన షేర్లు లిస్ట్కానున్నాయి. 1985లో ఆభరణాల విక్రయ మార్కెట్లోకి అడుగుపెట్టిన లలితా జ్యూవెల్లరీకి భారీ స్థాయిలో రిటైల్ నెట్వర్క్ కలిగివున్నది.