Bus Accident | వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మండలం కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డులో బోల్తా పడిన విషయం తెలిసిందే. బస్సులో దాదాపు 50 మంది ఉండగా.. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సుమారు 15 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
కాగా బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కండ్లకు కట్టినట్టుగా కనిపించింది. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను కాలం చెల్లిన, తుప్పు పట్టిన స్ట్రెచర్‌పై క్షతగాత్రుల తరలించారు. ఈ క్రమంలో సిబ్బంది నిర్లక్ష్యంతో క్షతగాత్రులు స్ట్రెచర్‌పై నుంచి కిందపడిపోయారు.
క్షతగాత్రులు వీల్చైర్లు లేకపోవడంతో చేసేదేమి లేక తీవ్ర గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రేవంత్ సర్కార్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.
వికారాబాద్ బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో నిర్లక్ష్యం
వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన, తుప్పు పట్టిన స్ట్రెచర్‌పై క్షతగాత్రుల తరలింపు
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో స్ట్రెచర్‌పై నుంచి కిందపడిన క్షతగాత్రులు
వీల్చైర్లు లేకపోవడంతో తీవ్ర గాయాలతో నడుచుకుంటూ… https://t.co/PH698jhaeQ pic.twitter.com/EXOYvrQhLU
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2026