కుటుంబాల వ్యాపారం 138 లక్షల కోట్లకు
దేశవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న కుటుంబాల సంపద జెట్‌స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నది. దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ.. భారతదేశంలో అత్యంత ధనిక వ్యాపార కుటుంబాల్లో తొలిస్థానంలో నిలిచారు.
- రోజుకు రూ.4 వేల కోట్లకు పైగా పెరిగిన బిజినెస్
ముంబై, ఆగస్టు 11 : దేశవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న కుటుంబాల సంపద జెట్‌స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నది. దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ.. భారతదేశంలో అత్యంత ధనిక వ్యాపార కుటుంబాల్లో తొలిస్థానంలో నిలిచారు. 2026లో దేశీయ సంపద 8.5 శాతం తగ్గి రూ.25.8 లక్షల కోట్లకు పడిపోయినప్పటికీ, దేశంలో అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా ముకేశ్ అంబానీ తమ స్థానాన్ని నిలబెట్టుకున్నట్టు హురున్ ఇండియా 2026 ఏడాదికిగాను విడుదల చేసిన బార్క్లేవ్స్ ప్రైవేట్ క్లయింట్ హురున్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్నది.
ఈ జాబితాలో రూ.19.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. రూ.12.1 లక్షల కోట్ల సంపదతో టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకోగా, రూ.8.14 లక్షల కోట్లతో కుమార్ మంగళం బిర్లా ఆ తర్వాత స్థానం దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యుల వ్యాపారం మొత్తం విలువ 1.46 లక్షల కోట్లు లేదా రూ.138 లక్షల కోట్లుగా నమోదైందన్నారు. నెదర్లాండ్స్, సౌదీ, స్విట్జర్లాండ్, పోలాండ్ దేశ ఆర్థిక వ్యవస్థ కంటే అధికం. దేశీయ టాప్-300 కుటుంబ సభ్యుల వ్యాపారాలు గడిచిన రెండేండ్లలో రోజుకూ రూ.4,076 కోట్లు జమవుతున్నాయని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

