హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో(Mancharyala) విషాదం చోటు చేసుకుంది. బండరాయితో కొట్టి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన హాజీపూర్‌లో చోటు చేసుకుంది. మల్యాల నరేష్ అనే వ్యక్తిని చైతన్య బండరాయితో మోది హత్య(Brutal murder) చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే (Extramarital affair) కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నరేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.