Kamareddy | నస్రుల్లాబాద్, డిసెంబర్ 31 : మండుతున్న గడ్డి వాములోకి ఓ వ్యక్తి తన ఏడేండ్ల కూతురిని విసిరేశాడు. అదృష్టవశాత్తు ఆ చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో ఆదివారం జరిగింది.
గ్రామానికి చెందిన దేశాయిపేట్ సాయిలు పెద్ద కుమార్తె అంకిత తన చెల్లితో కలిసి ఆడుకుంటున్నది. అదే గ్రామానికి చెందిన కొట్టాల గంగాధర్‌కు చెందిన గడ్డి వాముకు మంటలు అంటుకున్నాయి. అంకిత తన గడ్డివాముకు నిప్పంటించిందని గంగాధర్ తిడుతుండగా మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో తన కుమార్తెను అదే గడ్డివాములోకి విసిరేశాడు. తక్షణమే స్పందించిన గంగాధర్ ఆ చిన్నారిని రక్షించాడు.