కోటగిరి, జూలై 28 : అమెరికాలో బోటింగ్‌కు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి సరస్సులో పడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ నివాసి వడ్లమూడి హరికృష్ణ (49) పాతికేళ్ల క్రితం అమెరికాకు వలసవెళ్లారు.
అక్కడి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శనివారం వర్జీనియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో సరస్సులో పడిపోయాడు. గమనించిన స్నేహితుడి కుమార్తె హరికృష్ణను పైకి తీసుకొచ్చి సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు.