రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీత కార్మికుడైన రమేష్ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య బాలామణి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. రమేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.