ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం తోడుంటాని అగ్నిసాక్షిగా ఒక్కటైన భర్తే(Husband) భార్యను కత్తితో పొడిచి(Stabbed his wife) అత్యంత కిరాతకంగా(Brutal murder) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాయిద్పూర్లో చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యేసుల లక్ష్మణ్(32), సునీత పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
కాగా, మద్యం మత్తులో లక్ష్మణ్ భార్యతో గొడవపడి సునీతను కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో రిమ్స్ హాస్పిట ల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల వల్లే లక్ష్మణ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, లక్ష్మణ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.