రంగారెడ్డి : రాజేంద్రనగర్ చింతల్మెట్లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌పై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు దుకాణం ఎదుటకు సైతం వ్యాపించాయి. కాంప్లెక్స్ ఎదుట పార్క్ చేసి ఉన్న ఐదుకార్లకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి, మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాంప్లెక్స్ మొదటి, రెండో అంతస్తులో నివాస గృహాలున్నాయి. పైఅంతస్థులో ఉన్న వారిని ఖాళీ చేయించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.