Oil Palm Cultivation | తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు భేష్.. మలేషియా అధికారుల బృందం ప్రశంస
Oil Palm Cultivation | తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు తీరు ను మలేషియా అధికారుల బృందం ప్రశంసించింది. తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయడంపై ఆశ్చర్యం వ్య క్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కృషిని, రైతుల ఆలోచనను శ్లాఘించింది.
- తెలంగాణకు మలేషియా బృందం ప్రశంస
- తక్కువ కాలంలో ఎక్కువ సాగుపై కితాబు
- సాగుకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు తీరు ను మలేషియా అధికారుల బృందం ప్రశంసించింది. తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయడంపై ఆశ్చర్యం వ్య క్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కృషిని, రైతుల ఆలోచనను శ్లాఘించింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించి ఆయిల్‌పామ్ సాగు తీరుతెన్నులను పరిశీలించింది. రాష్ట్ర వ్య వసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమైంది.
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు పెంపునకు చేపడుతున్న చర్యలను రాష్ట్ర అధికారులు వారికి వివరించారు. 1992-93 నుంచి 2022-23 వరకు తెలంగాణలో 1.54 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగైందని, ఇందులో రాష్ట్రం ఏర్పడిన తర్వాతే 1.18 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామని తెలిపారు. నిరుడు రికార్డు స్థాయిలో 83 వేల ఎకరాలను సాగులోకి తెచ్చామని చెప్పా రు.
ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళిక రూపొందించామని, ఇం దుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.750 కోట్లు కేటాయించిందని వివరించారు. రానున్న ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మలేషియా బృందం సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు అన్నివిధాలా చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఆయిల్‌పామ్‌కు అనుకూలమే కాదనుకున్న తెలంగాణలో ఆ పంటను సాగుచేసి సత్తా చాటారని ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

