Group-1 | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని నిరుద్యోగులు నోరు పోయేలా మొత్తుకున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. నిరుద్యోగుల డిమాండ్‌ను పక్కకు పెట్టి చివరకు 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. ఏండ్లకు ఏండ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన అభ్యర్థుల్లో చాలా మంది గ్రూప్-1 మెయిన్స్‌కు దూరమయ్యారు. అలాంటి అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉద్యోగ నియమాకాల్లో ఎలాంటి రూల్స్ మార్చమని చెప్పి, నిరుద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు నిరుద్యోగుల కన్నీటికి కారణమైందంటూ బోరున విలపిస్తున్నారు. మా చావును చూసుకునేందుకే మేం ఒక ప్రభుత్వాన్ని మార్చామా..? అని వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పుడు మేం ఏ చెట్టుకు ఉరి పెట్టుకోవాలి అంటూ రేవంత్ సర్కార్‌ను నిలదీస్తున్నారు.
ఎందుకు సార్ ఇదంతా.. మూడు సంవత్సరాల నుంచి ఇంటికి కూడా వెళ్లడం లేదు. లాస్ట్ ఇయరంతా క్వాలిఫై అయ్యాం కదా..? ఈ ఒక్కసారి మాకు ఈ ఖర్మ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఉన్న రిజర్వేషన్లు అన్ని తీసేశారు. తీసేస్తే తీసేశారు.. 1:100 అయినా పిలవొచ్చు కదా..? మెయిన్స్ రాసుకుంటాం కదా..? కోచింగ్‌లు కూడా అయిపోయాయి. ఇప్పుడు మేం ఏం చేయాలి.. ఏ చెట్టుకు ఉరి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్లాలి. అసలు మాకు బతుకే లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే గవర్నమెంట్‌కు ఏం వచ్చింది సర్ అసలు. మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. ఆ తర్వాత మేం ఏం అడగమని కూడా ప్రామీస్ చేస్తున్నాం. ఏపీలో అవకాశం ఇచ్చారు కదా..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2008లో ఎగ్జామ్ రాసిన నెల రోజులకు 1:100 అవకాశం ఇచ్చాడు కదా..? తెలంగాణ జనాలకే ఈ దౌర్భగ్యామా..? క్యాన్షిల్ చేసిన ఎగ్జామ్‌కు మళ్లీ ఎగ్జామ్ పెట్టకుండా రీ నోటిఫికేషన్ వేశారు.. ఈ విషయంలో మేం ఏమైనా అన్నామా..? రిజర్వేషన్లు అన్ని ఎత్తేసి ప్రిలిమ్స్ పెట్టారు.. మేం ఏమైనా అన్నామా..? మాకు 1:100 పిలిచి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అంటున్నాం. మేం గొప్పోళ్లం కాకపోవచ్చు.. చదువుకున్నాం కాబట్టి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం అది తప్పా..? నేను ఇప్పుడు చస్తా.. రాహుల్ గాంధీ ఇంటికి తీసుకెళ్లమని చెప్పండి.. నాకు ఇంక బతకడానికి ఆప్షనే లేదు సర్. నాకు వేరే అపార్చునిటీ లేనే లేదు సర్. ఇది ఒక్క ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నం సర్.. 12 ఏండ్ల తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు. నిబంధనలు ఏం మార్చం అని అన్నారు. మేం సచ్చిపోతే ఈ గవర్నమెంట్‌కు ఏం వస్తది సర్. మా చావు కోసమేనా ఇదంతా..? మా చావును చూసుకునేందుకేనా ఇన్ని రోజులు చదువుకున్నది. మా చావును చూసుకునేందుకు ఒక ప్రభుత్వాన్ని మార్చినమా.. అనిపిస్తుంది సర్. మా వల్ల కాదు సర్ మీకు దండం పెడుతా.. మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోండి సర్.. అక్కడ చచ్చిపోతాం. రాహుల్ గాంధీ అప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా..? మా బాధలు తీర్చుతామని చెప్పలేదా..? భట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 పిలవాలని అనలేదా..? నిన్నగాక మొన్న ఏపీ గ్రూప్-2లో ఇవ్వలేదా సర్. జీవో 29 సవరిస్తే సరిపోతది అని చెబుతుంటే కొందరు రాజకీయాలు చేస్తున్నరు. ఎవర్ని చావగొట్టడానికి ఈ రాజకీయాలు చేస్తున్నరు. అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తది.. చనిపోయేటోన్ని బతికించడానికి ప్రభుత్వం ఆలోచిస్తది. ఈ ప్రభుత్వం అట్ల కాదు.. బతికేతోన్ని కూడా చంపి పెడుతరు. ఎందుకు బతకాలి.. బతకడానికి ఇంకోక ఆప్షన్ కూడా లేదు సర్. మాకు మరో దారి లేదు సర్.. ప్లీజ్ ఆ రూల్స్ మార్చండి సర్ అంటూ ఓ నిరుద్యోగ యువతి బోరున విలపించింది.
రెండు సార్లు క్వాలిఫై అయి ఈసారి కాలేదు
1:50 కాదు 1:100 ఇవ్వకపోతే నాకే సావే దిక్కు అంటే అంటూ బోరున విలంపించిన గ్రూప్ – 1 అభ్యర్థి. pic.twitter.com/vPNxXIVACJ
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2024