హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరణ తీర్పుపై అధ్యయనం, సిఫారసులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోచైర్మన్‌గా, మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి సభ్యులుగా, ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మెంబర్ సెక్రటరీగా నియమించారు. కమిటీ ఏర్పాటుపై ఎస్సీవర్గాల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.