శనివారం 29 ఫిబ్రవరి 2020
తాగిన మత్తులో చెల్లిపై అన్న అఘాయిత్యం

తాగిన మత్తులో చెల్లిపై అన్న అఘాయిత్యం

Feb 14, 2020 , 15:25:33
PRINT
తాగిన మత్తులో చెల్లిపై అన్న అఘాయిత్యం

భద్రాద్రి కొత్తగూడెం : తాగిన మత్తులో ఓ యువకుడు వావివరుసలు మరిచాడు. తోడబుట్టిన చెల్లిపై ఆ కామాంధుడు కన్నేశాడు. తనతో పాటు తన స్నేహితులను ప్రోత్సహించి.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ జ్యోతి నగర్‌లో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జ్యోతినగర్‌కు చెందిన 17 ఏళ్ల యువతిని ఇంట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. యువతి బాధ్యతలను ఆమె సోదరుడికి తల్లిదండ్రులు అప్పజెప్పి వెళ్లిపోయారు.

అయితే నిన్న రాత్రి ఇంట్లోనే యువతి సోదరుడు, అతని స్నేహితులు ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో చెల్లిపై అన్నతో పాటు ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. అయితే యువతికే ఇప్పటికే పెళ్లి సంబంధం కుదిరింది. ఆమె మైనర్‌ కావడంతో వచ్చే ఏడాది పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


logo