Nirmal | నిర్మల్ : అన్నదాతల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. సకాలంలో వడ్లు కొనకపోవడంతో.. అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని నిప్పులు చెరుగుతున్నారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణ్చందా మండలం బాబాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 15 రోజులవుతుంది. అయినప్పటికీ రైతుల నుంచి ధాన్యం సేకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో అన్నదాత నిరసన తెలిపాడు. బస్తాకు 41 కిలోలు తూకం వేస్తున్నారని.. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నదాతలు కోరారు.
ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన
నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో నిరసన తెలిపిన రైతు
లక్ష్మణ చాందా మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి… pic.twitter.com/zlApEmzGqt
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2025