కాంగ్రెస్ సర్కార్ అచ్చినంక.. మా జీవితమే ఆగమైంది
‘కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక మా బతుకులు ఆగమయ్యాయి’ అని ఓ రైతు ఆవేదన చెందాడు. శనివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పర్యటిస్తున్న క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రైతు ర్యాకం కిష్టయ్యను పలుకరిస్తూ బాగున్నావా పెద్దాయనా? అని అడుగగా.. ఆ రైతు తన కష్టాలను ఏకరువు పెట్టాడు.
- యూరియా లేదు, నీళ్లు లేవు, కరెంటు సక్కగా రాదు
- దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎదుట ఓ రైతు ఆవేదన
మిరుదొడ్డి, ఆగస్టు 22 : ‘కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక మా బతుకులు ఆగమయ్యాయి’ అని ఓ రైతు ఆవేదన చెందాడు. శనివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పర్యటిస్తున్న క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రైతు ర్యాకం కిష్టయ్యను పలుకరిస్తూ బాగున్నావా పెద్దాయనా? అని అడుగగా.. ఆ రైతు తన కష్టాలను ఏకరువు పెట్టాడు. ‘ఏం బాగున్నామయ్యా.. ఆగమైపోయినం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినప్పటి నుంచి మాకు అన్నీ కష్టాలే’ అని తన గోడువెళ్లబోసుకున్నాడు.
‘నాకు ఫోన్ లేకపాయే.. యూరి యా రాకపాయే.. పొలాలకు నీళ్లు లేవు.. అచ్చిన నీళ్లతో పొలం సరిగ్గా పారుతలేదు.. కరెంటు కూడా సక్కగా వస్తలేదు.. గిదేం పాలనో అర్థమైతలేదు.. రైతులమంతా అష్టకష్టాలు పతుడున్నం’ అని ఆవేదన వ్యక్తంచేశా డు. కాంగ్రెస్‌కు ఓట్లేసి ఆగం చేసుకున్నం.. ఇప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నం’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు. ‘ఇప్పడు గీ సీఎం రేవంత్‌రెడ్డి పాలన పోయి మళ్లా కేసీఆర్ సార్ పాలన అత్తనే మా రైతులకు మంచి రోజులు వత్తాయి’ అని తెగేసి చెప్పాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

