అమ్మాయిల ప్రేమ మాటల్లో కంటే వారి ప్రవర్తనలోనే ఎకువగా కనిపిస్తుంది. ఇక లవ్ విషయంలో ప్రతీ అబ్బాయి మనసులో మెదిలే పెద్ద క్వశ్చన్ ఏంటో తెలుసా? ‘తను నన్ను నిజంగా ప్రేమిస్తున్నదా, లేదా?’ అని. సాధారణంగా అమ్మాయిలు తమ ప్రేమని గట్టిగా బయటికి చెప్పరు. కానీ, వాళ్ల చిన్నచిన్న పనుల్లో, మాటల్లో, అలకల్లో ఆ లవ్ క్లియర్‌గా కనిపిస్తుందని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుందో లేదో ఈ నాలుగు విషయాల్లో స్పష్టమవుతుంది…!
చిన్న విషయాల్లోనూ : ఒక అమ్మాయికి అబ్బాయి మీద చిన్న కోపం వచ్చినా అది తాతాలికమే. ఆ వ్యక్తి తనవాడు అని బలంగా అనుకున్నప్పుడే ఈ కోపతాపాలు పుట్టుకొస్తాయి. ఇది లవ్ బాండింగ్‌కు చిన్న సంకేతంగా భావించవచ్చు.
స్వీట్ జెలసీ : తను ఇష్టపడిన వ్యక్తి వేరే అమ్మాయితో మాట్లాడితే ఆమె పైకి ఏం అనకపోవచ్చు. కానీ, తర్వాత ‘ఇందాక మాట్లాడింది ఎవరు?’ అని కచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న కాస్త గమ్మత్తుగానూ ఉంటుంది. ఆ అమ్మాయి గురించి తెలివిగా ఆరా తీసే ప్రయత్నం చేసిందా.. కుచ్‌తో హై అని అంచనాకు రావొచ్చు!
కళ్లలో బాధ : కొన్ని సమయాల్లో అమ్మాయిలు మౌనాన్ని ఆశ్రయిస్తారు. కానీ, మనసుతో చూస్తే వారి కండ్లు ఏవో చెబుతుంటాయి. ఆ చూపుల్లో ప్రేమతో కూడిన ఆవేదన తొంగి చూస్తుంటుంది. అలా చెప్పలేని బాధను ఎవరి ముందైతే వ్యక్తపరుస్తుందో అతనంటే ఆమెకు ఇష్టమని అంచనాకు వచ్చేయాలి.
కేరింగ్ : ప్రేమించే వ్యక్తిని అమ్మాయిలు కోపం వస్తే కాస్త గట్టిగానే మందలిస్తారు. కానీ, ఇతరులు ఎవరైనా తనవాడిని పల్లెత్తు మాటన్నా అస్సలు సహించరు. నిజానికి అమ్మాయిల ప్రేమ పెద్ద పెద్ద మాటల్లో కనిపించకపోవచ్చు! కానీ, చిన్న చిన్న పనుల్లో కనిపిస్తుంది. తన అనుకున్న వ్యక్తి కోసం భారీ
త్యాగాలకే సిద్ధపడుతుంటుంది.