Mulugu | ములుగు : ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది. దీంతో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. రైతు కాలు నుజ్జునుజ్జు అయింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధిత రైతును హుటాహుటిన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బాధిత రైతు మదనపల్లి గ్రామానికి చెందిన కుంటమల్ల సాంబయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పొలంలో నాటు బాంబు పేలి రైతుకు తీవ్ర గాయాలు
ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామం సమీపంలోని తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తున్న మదనపల్లి గ్రామానికి చెందిన కుంటమల్ల సాంబయ్య అనే రైతు
ఈ క్రమంలో ఒక్కసారిగా నాటుబాంబు పేలడంతో, నుజ్జు నుజ్జు అయిన రైతు కాలు
రైతును చికిత్స నిమిత్తం వరంగల్… pic.twitter.com/y3GjBo9u7z
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2025