కోనరావుపేట, డిసెంబర్ 31: ద్విచక్ర వాహనంపై వరినారును సంచుల్లో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో పడిపోయి ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన నేవూరి దేవయ్య (68) వరినాటు వేసేందుకు నారును సంచుల్లో నింపుకొని తన ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో దేవయ్య పొలంలో కూరుకుపోగా నారుసంచులు, వాహనం అతడిపై పడ్డాయి. ఎటూలేవలేక ఊపిరాడకపోవడంతో దేవయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అనసూయ, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.