దుబ్బాక, సెప్టెంబర్ 30: పొలం లో కరెంటుషాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన కంతుల రాజమల్లయ్య(58) వరి సాగుతోపాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు.
మంగళవారం రాత్రి రాజమల్లయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. పౌల్ట్రీలో కరెంట్ సరఫరా లేకపోవడంతో, పక్కనే ఉన్న ట్రాన్సుఫార్మర్ వద్దకు వెళ్తున్న క్రమంలో కరెంట్ తీగ తగిలింది. దీంతో విద్యుత్తు షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.